చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ నారాయణ నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గోడి సతీశ్.. ఇప్పటి వరకు 35 చోరీలకు పాల్పడ్డాడు. 12 కేసుల్లో శిక్షను అనుభవించాడు.
దేవరపల్లి మండలం యర్నగూడెంలో 2 వారాల క్రితం ఓ ఇంట్లో చోరికి పాల్పడి సుమారు 9 లక్షల నగదు, 18 కాసుల బంగారం అపహరించాడు. ఈ కేసులో దొరికిన ఆధారాల మేరకు గోడి సతీశ్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 12 లక్షల నగదు, రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: