ETV Bharat / state

ద్వారక తిరుమల స్వామివారికి భక్తుల పరోక్ష సేవ

author img

By

Published : Apr 12, 2020, 5:21 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారి సేవలను భక్తులు పరోక్షంగా జరిపించుకునేందుకు దేవస్థానం వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే అష్టోత్తరనామార్చన పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవస్థానం కొత్తగా మరో నాలుగు సేవలను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైంది.

స్వామివారికి భక్తుల పరోక్ష సేవ
స్వామివారికి భక్తుల పరోక్ష సేవ

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్​డౌన్ అమల్లో ఉన్నంత కాలం ద్వారకా తిరుమల దేవస్థానం స్వామి వారి అన్ని దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసింది. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి. అయితే భక్తుల అభీష్టం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయంలో అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీ నుంచి దేవస్థానం ప్రారంభించింది. భక్తులు నేరుగా ఈ సేవలో పాల్గొనకుండా పరోక్షంగా ఈ సేవ చేసుకునే విధంగా వీలు కల్పించింది. ఆన్​లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల గోత్రనామాలను స్వామివారి ఎదుట చదివి ఈ పూజ నిర్వహిస్తున్నారు. ఈ పూజ టికెట్ ధరను దేవస్థానం 300గా నిర్ణయించింది. ఈ సేవకు విశేష స్పందన రావటంతో కొత్తగా స్వర్ణ తులసీదళార్చన, అమ్మవార్ల వద్ద కుంకుమార్చనలు, స్వామి వారి నిత్య కళ్యాణం, గోపూజ వంటి సేవలను ప్రారంభించేందుకు సంకల్పించింది. ఈ సేవలను ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్​ పొడిగించండి: సీఎంకు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.