పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఎర్రకాలువ నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా అడిషినల్ ఎస్పీ కరిముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో తెల్లవారు జామున జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గోదావరి నదీ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, పట్టిసీమ, గూటాల, కొవ్వూరు , లింగపాలెం, దెందులూరు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించామని ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు.
ఇది చదవండి మాస్క్ లేకుండా తిరిగారా? క్వారంటైన్ కేంద్రమే దిక్కు