పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:అరెస్ట్‌లను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు తెదేపా పిలుపు