ETV Bharat / state

ఆదాయం నిలవాలంటే అల'వాట్స్‌' మార్చుకుందాం

కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది. భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మును సైతం బయటకు తీయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆరు నెలలు గడిచింది. ఖర్చులు తగ్గించుకోకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు పడక తప్పదన్న ఆలోచన అందరిలోనూ మొదలైంది. నిత్యావసరాల్లో ఒకటైన విద్యుత్తు వాడకం తగ్గించుకోవడం ద్వారా కొంత సొమ్ము ఆదా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలా తగ్గించుకోవచ్చో పొదుపు మంత్రంలో చూద్దాం.

if we want to maintain income let's change habits
అల'వాట్స్‌' మార్చుకుందాం
author img

By

Published : Oct 12, 2020, 1:36 PM IST

విద్యుత్తు వినియోగాన్ని బట్టి పంపిణీ సంస్థ స్లాబులుగా విభజించి ఛార్జీలు వసూలు చేస్తోంది. నెలలో వంద యూనిట్ల వరకు వాడితే బిల్లు రూ.202.50 వస్తుంది. ఒక్క యూనిట్‌ అదనంగా వాడినా స్లాబు మారి రూ.334.30 అవుతుంది. ఇంధన సుంకం, సేవా రుసుము అదనం. యూనిట్లు వంద దాటకుండా చూసుకుంటే నెలకు రూ.131.80, ఏడాదికి రూ.1581.6 ఆదా చేసుకోవచ్చు. 200 యూనిట్ల వరకు విద్యుత్తు బిల్లు రూ.760 వస్తుంది. ఒక్క యూనిట్‌ ఎక్కువ వాడినా బిల్లు రూ.1007.20 అవుతుంది. అంటే నెల బిల్లు 247.20 పెరుగుతుందన్న మాట.

ఏ ఉపకరణంపై ఎలాంటి జాగ్రత్త అవసరం

రిఫ్రిజిరేటర్‌: పాత ఫ్రిజ్‌లకు కరెంట్‌ ఎక్కువ కాలుతుంది. డీప్‌ఫ్రిజ్‌లో మంచు గడ్డ కడుతోందంటే కాలం చెల్లినట్లే. పాతదాంతో 166 యూనిట్లు కాలితే కొత్త ఫ్రిజ్‌తో వంద యూనిట్ల లోపే వస్తుంది. బిల్లులో నెలకు రూ.300కు పైగా ఆదా అవుతుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూడాలి.

ఏసీ: సాధారణ రోజుల్లోనూ ఏసీల వినియోగం పెరుగుతోంది. 18-19 డిగ్రీల మధ్య కాకుండా, 24-26 డిగ్రీలు ఉండేలా చూసుకుంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఏసీతోపాటు ఫ్యాన్‌ వేసుకోవడం మేలు. అలానే ఏసీ గదిలో అనవసర వస్తువులు ఉంటే తీసేయాలి.

వాషింగ్‌ మెషిన్‌: ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతికేయడం చాలామందికి అలవాటు. పూర్తిగా లోడు అయ్యాకే వాషింగ్‌ మెషిన్‌ ఉపయోగించాలి. రోజువారీ దుస్తులకు వేడి నీరు అవసరంలేదు.

మెక్రోఓవెన్‌: వండే పదార్థాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మధ్యలో తరచూ తెరిచి చూడటం వల్ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు పడిపోతుంది. మళ్లీ వేడెక్కేందుకు అధిక విద్యుత్తు ఖర్చవుతుంది.

గీజర్‌: గీజర్‌ ఉన్న ఇళ్లలో 200 యూనిట్లు దాటడంతో బిల్లు రూ.వెయ్యిపైనే వస్తుంటుంది. బిల్లు తగ్గాలంటే ఇంట్లోవారు వెనువెంటనే స్నానాలు చేయాలి. థెర్మోస్టాట్‌ 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్‌ నీటిని వాడేలా పైపులు ఉండాలి.

దీపాలు: నాణ్యమైన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లతో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. 10, 20, 22 వాట్స్‌వి సరిపోతాయి. పగలు కిటికీలు తెరవాలి. రాత్రుళ్లు మనం ఎక్కడుంటే అక్కడే బల్బులు వేసుకోవాలి. కొత్త ఇళ్లలో సెన్సర్‌తో పనిచేసే బల్బులు మంచిది. ట్యూబ్‌లైట్లలో త్రీ ఇన్‌ వన్‌ వచ్చాయి. ఒకసారి స్విచ్‌ వేస్తే తెలుపు, రెండోసారి వామ్‌ వైట్, మూడోసారి తక్కువ వెలుతురుతో వెలుగుతాయి.

తక్కువ వాట్స్‌ పరికరాలు మేలు

పాత పరికరాలు వినియోగిస్తే ఎక్కువ విద్యుత్తు ఖర్చు అవుతుంది. విద్యుత్తును సాధ్యమైనంత వరకు ఆదా చేయాలంటే విద్యుత్తు బాగా తక్కువగా ఖర్చయ్యేలా రూపొందించిన పరికరాలను వాడాలి. తక్కువ వాట్స్‌ తీసుకునే ఫ్రిజ్‌లు, ఏసీలు, దీపాలు, ఇతర పరికరాలను అందుబాటులోకి వచ్చాయి. వాటిని వినియోగించాలి. -జనార్దనరావు, విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్‌ఈ

పర్యవేక్షణతో ఆదా సాధ్యమే

లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్తు బిల్లు తగ్గించుకోవాలనుకున్నాం. అవసరం మేరకు గృహోపకరణాలను వినియోగిస్తున్నాం. ఇంట్లో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలంటే, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఫ్యానులు, లైట్లు వేశాక పట్టించుకోకుండా కొన్ని గంటల పాటు అలాగే వదిలేస్తాం. అవసరం లేనప్పుడు స్విచ్‌లను ఆపేస్తే చాలా విద్యుత్తు ఆదా అవుతుంది.

-ఎల్‌.వెంకటేశ్వరరావు, విశ్రాంత ఆచార్యుడు

ఇదీ చదవండి: పశు పోషకులకు అండగా ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.