ETV Bharat / state

భార్య ఇంటి ముందు భర్త క్షుద్రపూజలు..!

భార్య ఇంటి ముందు భర్త క్షుద్ర పూజలు చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జరిగింది. ఈ మేరకు భార్య రాజకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెవెన్యూ, పోలీసులు అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు.

husband-worships-in-front-of-wifes-house-in-west-godavarai-district
husband-worships-in-front-of-wifes-house-in-west-godavarai-district
author img

By

Published : Nov 27, 2019, 11:00 PM IST

భార్య ఇంటి ముందు భర్త క్షుద్ర పూజలు...బాధితురాలు ఫిర్యాదు..!

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రవ్వవారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. రవ్వవారిగూడెంకు చెందిన పల్లపు రాజకుమారి భర్తతో విడిపోయి ఉంటుంది. కొద్ది రోజులుగా విడాకులు ఇవ్వాలని భార్యను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు. మరోవైపు కొద్ది రోజులుగా రాజకుమారి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు పెట్టి వెళ్తున్నాడు.

ఇవాళ కూడా అదే విధంగా వస్తువులు పెడుతుండగా... భార్య రాజకుమారి చూసి కేకలు వేసింది. అప్రమత్తమైన భర్త.. వెంటనే అక్కడ్నుంచీ పరారయ్యాడు. బాధితురాలు పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఘటనపై తహశీల్దార్, ఎస్సై గ్రామంలో విచారణ చేపట్టారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి : ఘనంగా వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు

Intro:AP_TPG_22_27_CHETHA_BADI_AV_AP0088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రవ్వ వారిగూడెం లో చేత బడులు చేస్తున్నారు అంటూ మహిళ ఆరోపించింది. తన భర్త తన ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తున్నారంటూ మహిళ బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. రవ్వవారిగూడెం కు చెందిన పల్లపు రాజకుమారి తన భర్తతో కాకుండా విడిగా ఉంటుంది. దీంతో భర్త కొద్దీ రోజులుగా విడాకులు ఇవ్వాలని హింసకు గురిచేస్తున్నారు. కొద్దీ రోజులుగా ఇంటి ముందు పసుపు, కుంకం నిమ్మకాయలు, బొమ్మలు పెట్టి వెళ్లి పోతున్నాడు. బుధవారం నాడు అదేవిధంగా వస్తువులు పెడుతుండగా రాజకుమారి గమనించి కేకలు వేసింది. దీంతో భర్త పరారయ్యాడు. గతంలో ఇదే గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించి పిర్యాదు చేసింది. తహశీల్దార్, దొర, ఎస్సై గ్రామంలోకి వెళ్లి విచారణ చేశారు. మూఢ నమ్మకాలు నమ్మవద్దని గ్రామస్థులకు అవగాహన చేశారుBody:చేత బడిConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.