పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలువురు సీపీఐ, నగర కమిటీ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా ఆందోళన నిర్వహిస్తారనే కారణంతో వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. అన్నీ పార్టీలు అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి అన్నారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్లటం సరైంది కాదన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనవసరమైన హౌస్ అరెస్ట్లు చేసి తమను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ఏలూరులో అమరావతి పరిరక్షణ ప్రజాయాత్ర చేపట్టిన తెదేపా నాయకులను గృహనిర్బంధించారు. పట్టణ నియోజవర్గం పార్టీ బాధ్యుడు బడేటి రాధాకృష్ణ ఆధ్వర్వంలో కార్యకర్తలు, నాయకులు రైతులకు మద్దతుగా అమరావతికి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొన్నారు. నిర్బంధంలోనే పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు వారికి పోలీసులు నోటీసులు అందించారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఏలూరు వింత వ్యాధికి పురుగు మందులే కారణం..!