ETV Bharat / state

HC on Kolleru Lake: కొల్లేరు పరిధిలో చేపల చెరువుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - kolleru lake news

కొల్లేరు సరస్సు పరిధిలో చేపల చెరువు తవ్వకం పనులు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌ కుమార్ మిశ్ర, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

hc on kolleru lake
hc on kolleru lake
author img

By

Published : Feb 19, 2022, 7:05 AM IST

Kolleru Lake: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం అగడలలంక గ్రామం కొల్లేరు సరస్సు పరిధిలో చేపల చెరువు తవ్వకం పనులు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌ కుమార్ మిశ్ర, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

సర్వే నంబరు 1424లో నిబంధనలకు విరుద్ధంగా... రమణ ఫిషరీస్ ప్రైవేటు లిమిటెడ్ చేపల చెరువు తవ్వడాన్ని సవాలు చేస్తూ ఘంటసాల నరేంద్రబాబు హైకోర్టులో పిల్ వేశారు. సంబంధిత సర్వే నంబరులో చెరువు తవ్వకాలకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. చెరువు తవ్వకాల ప్రక్రియను నిలువరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి:

ఆర్టీసీలోని ఆ కుటుంబాలకు.. ప్రభుత్వం శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.