ETV Bharat / state

చిన్న తిరుపతిలోని నక్షత్ర వనం.. ఎందుకంత ప్రత్యేకం? - nakshatra vanam plants specials news

ప్రకృతిని ప్రభావితం చేసే పచ్చని వృక్షాలు... జీవరాసుల మనుగడకు దోహదం చేస్తున్నాయి. అలాంటి వృక్షాలను పూజించే సంస్కృతి భారత్‌లో అనాదిగా వస్తోంది. ఈ క్రమంలోనే నక్షత్ర వనం పేరుతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలోని ఈ నక్షత్రవనానికి ప్రత్యేక స్థానముంది. ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన నక్షత్రవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

nakshatra vanam
nakshatra vanam
author img

By

Published : Oct 4, 2020, 10:16 PM IST

చిన్న తిరుపతిలోని నక్షత్ర వనం ఎందుకంత ప్రత్యేకం?

ప్రతి గ్రహానికి, నక్షత్రానికి సంబంధించి.. ఒక వృక్షం ఉంటుందని భారతీయ సనాతన వేదాలు చెబుతున్నాయి. ఆయా నక్షత్రాలు, గ్రహల్లో జన్మించినవారు ఆయా వృక్షాలకు పూజలు చేస్తే శుభం కలుగుతుందని హిందూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ సన్నిధిలో నక్షత్రవనాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొనేందుకు బయలుదేరే భక్తులు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నక్షత్రవనాన్ని ఏర్పాటు చేశారు. ఆగమ శాస్త్రం మేరకు ఈ నక్షత్ర వనాలను ఆరాధించడం వల్ల దోష పరిహారాలు కలుగుతాయని ఆగమ పండితులు అంటున్నారు.

ఒక్కో గ్రహానికి... ఒక్కో వృక్షం

ఆగమ శాస్త్రంలో పేర్కొన్నట్లుగా నక్షత్ర వనాన్ని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. మొత్తం 36 వృక్షాలతో ఈ నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 27 నక్షత్రాలు, 9గ్రహాలకు సంబంధించిన వృక్షాలను నాటారు. 9 గ్రహాలకు ఒక్కో వృక్షాన్ని ఏర్పాటు చేశారు. చంద్రునికి మోదుగా, సూర్యునికి ఎర్రచందనం, అంగారకునికి చండ్ర, బుధునికి రావి, గురుడికి ఉత్తరేణి, శుక్రునికి వెలగ, శనీశ్వరునికి జమ్మి, రాహువుకు గరిక, కేతువుకు దర్ప వృక్షాలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు.. ఆయా వృక్షాలకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలు పోతాయని ఆగమ శాస్త్రం చెబుతోంది.

సమిధలుగా వినియోగం

నక్షత్ర వనాల వల్ల ప్రజల్లో భక్తి ఉంటుందని తద్వారా వనాల వృద్ధికి ఇది దోహద పడుతుందని పేర్కొంటున్నారు. గ్రహాలకు శాంతి హోమాలు నిర్వహించే సమయంలో ఈ వృక్షాల చిన్న కొమ్మలు సమిధలుగా వాడుతున్నారు. దీనివల్ల ఆయా కొమ్మల నుంచి వచ్చిన పొగలు వాతావరణాన్ని శుభ్రచేస్తాయని.. మానవాళి ఆరోగ్యానికి దోహదం చేస్తాయని పండితులు అంటున్నారు. నక్షత్రాలు, గ్రహాలకు ఆయా వృక్షాలను ఏర్పాటు చేసి.. దేవతామూర్తులుగా కొలిచే సంస్కృతి, సంప్రదాయాలను వేదాలే నేర్పించాయని పండితులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.