వాయుగుండం ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వారకాతిరుమలలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలీస్ స్టేషన్ లోపలికి వరద నీరు వచ్చిచేరింది. స్థానిక సంత మార్కెట్ వద్ద ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. మండలంలో దేవినేనివారిగూడెం వద్ద గుర్రాల వాగు ఉద్ధృతంగా ప్రవహించటంతో.. రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. గుర్రాలవాగు ఉద్ధృతికి వీరిశెట్టిగూడెం-తిమ్మాపురం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటకృష్ణాపురం బీసీ కాలనీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇదీ చదవండి: నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం