కొవిడ్ చికిత్సలో 104 కాల్ సెంటర్ కీలకపాత్ర పోషించనుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ను ఆయన పరిశీలించారు. కొవిడ్ పరీక్ష నుంచి చికిత్స వరకు ఈ కాల్ సెంటర్ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
ప్రతి జిల్లాలోనూ 104 కాల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఆక్సిజన్ నుంచి కొవిడ్ మందుల వరకు అన్ని విభాగాలకు నోడల్ అధికారులు నియమించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
ఇదీ చదవండి: