ఇదీ చూడండి:
ఏలూరులో చేనేత హస్తకళల ప్రదర్శన ప్రారంభం - Handloom Handicrafts Exhibition in west godavari district
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే ప్రతి వారికి చేనేత హస్తం పథకం ద్వారా రూ.21 వేలను అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. నాణ్యతకు ఏ మాత్రం తగ్గకుండా సరసమైన ధరలకు ప్రజలకు చేనేత ఉత్పత్తులు అందించడం చాలా అభినందనీయమన్నారు. చేనేతలకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని అన్నారు.
ఏలూరులో చేనేత హస్తకళల ప్రదర్శన
ఇదీ చూడండి: