పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి 5,44,147 మంది అర్హులు కాగా వీరిలో 3,33,056 మంది అర్హుల జాబితాలో ఉన్నారు. వీరిలో 70,999 మంది బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ కాలేదు. మిగిలిన వారి బ్యాంకు ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున ఇంతవరకు రూ.507.08 కోట్లు జమ అయినట్లు గణంకాలు చెబుతున్నాయి.
కలెక్టరేట్ వద్ద గందరగోళం...
అమ్మ ఒడి పథకానికి అర్హత కలిగి ఉండి కూడా లబ్దిపొందలేక పోయినవారు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు తదితర ధ్రువపత్రాలతో గ్రీవెన్స్కి రావాలని అధికారులు సూచించారు. పెద్ద సంఖ్యలో ఏలూరు కలెక్టర్కు లబ్ధిదారులు వచ్చారు. అక్కడ దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియక నానా కష్టాలు పడ్డారు. చాలామంది చదువు రాక దరఖాస్తుల ఎలా పూర్తి చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో కంట్రోల్ చేయడం అధికారులకు కష్టతరంగా మారడంతో...వారందరినీ బయటకు పంపించేశారు. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండలాల్లో వాలంటీర్లు సచివాలయం దగ్గర దరఖాస్తులు తీసుకుని... అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఈ పథకం వర్తింపు చేసేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...దిశ కేసుల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు: డీజీపీ