ప్రస్తుతం సీజన్లో చేతినిండా పనితో గడపాల్సిన స్వర్ణకారులు లాక్డౌన్తో జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆభరణాల విక్రయాలకు ముఖ్య కేంద్రంగా నిలిచే నరసాపురంలో దుకాణాలు మూతపడటంతో స్వర్ణకారులు పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్వర్ణకారులను ఆదుకునేందుకు నరసాపురం బంగారం వర్తక సంఘం ముందుకొచ్చింది. నిరుపేదలైన 200 స్వర్ణకార కుటుంబాలకు రూ.2 లక్షల 20 వేల రూపాయలతో నిత్యావసరాలు సమకూర్చి అందజేశారు. ఈ కార్యక్రమంలో బంగారు వర్తక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ జైన్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రాజేంద్ర కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..