Arshdeep Singh IPL Auction 2025 : టీమ్ఇండియా పేసర్ అర్షదీప్ సింగ్ కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 3వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే కెరీర్లో ఓ అరుదైన ఘనత సాధించాడుయ. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు(92) పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(90) ను అధిగమించాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గానూ అర్షదీప్ నిలిచాడు.
టీ20 ఫార్మాట్లో అదుర్స్!
రెండేళ్ల క్రితం భారత జట్టులోకి వచ్చిన అర్ష్ దీప్, తక్కువ కాలంలోనే నమ్మదగ్గ బౌలర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా టీ20ల్లో తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేస్తూ డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్‌గా మారిపోయాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన ఈ 25ఏళ్ల పేసర్ అంచనాలు అందుకుంటున్నాడు. టీమ్ఇండియాలోకి వచ్చిన రెండేళ్లలోనే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అవతరించాడు.
కాసుల వర్షం కురిసేనా?
కాగా, 2019లో అర్షదీప్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతడు పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత ఐదేళ్లుగా అదే జట్టుకు ఆడిన అతడిని 2025 మెగా వేలానికి ముందు పంజాబ్ రిలీజ్ చేసింది. దీంతో అర్షదీప్ వేలంలోకి వచ్చాడు. తన బేస్‌ప్రైజ్ రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
అయితే ప్రస్తుత టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో మేటి బౌలర్‌గా ఉన్న అర్షదీప్ సింగ్ తమ జట్టులో ఉంటే బాగుంటుందనే భావనలో ఫ్రాంఛైజీలు ఉన్నాయి. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడమే కాకుండా వికెట్లు పడగొట్టే ఈ పంజాబీ పేసర్ కోసం వేలంలో తీవ్ర పోటీ ఉండే ఛాన్స్ ఉంది. పోటీపడి మరీ స్టార్ ఫ్రాంచైజీలు అతడి కోసం బిడ్డింగ్ వేసే అవకాశం ఉంది.
భారీ ధర పక్కా!
పొట్టి ఫార్మాట్ నిలకడగా రాణిస్తున్న అర్షదీప్‌కు మెగా వేలంలో భారీ ధర దక్కే ఛాన్స్ ఉంది. మరి మరో పది రోజుల్లో జరగనున్న వేలంలో అతడు ఎంత ధర పలుకుతాడు? అతడిని ఎవరు దక్కించుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అర్షదీప్‌పై కాసుల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కనీసం రూ. 12కోట్లకు పైనే ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు.
మళ్లీ అటేనా?
రూ.100కోట్లకు పైగా పర్స్ వ్యాల్యూతో వేలంలోకి దిగుతున్న పంజాబ్ వద్ద నాలుగు ఆర్టీఎమ్ కార్డ్ అప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అర్షదీప్ సూపర్ ఫామ్‌లో ఉండడం వల్ల పంజాబ్ అతడిని మళ్లీ కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపవచ్చు. నేరుగా వేలంలో లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తమ పాత ప్లేయర్‌ను జట్టులోకి తీసుకునేందుకు పంజాబ్ వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి అర్షదీప్ కోసం పంజాబ్ కూడా లైన్లో ఉన్నట్లే!
🚨𝐌𝐘 𝐁𝐎𝐋𝐃 𝐈𝐏𝐋 𝐀𝐔𝐂𝐓𝐈𝐎𝐍 𝐏𝐑𝐄𝐃𝐈𝐂𝐓𝐈𝐎𝐍:-
— Pratyush Halder (@pratyush_no7) November 12, 2024
- 𝑨𝑹𝑺𝑯𝑫𝑬𝑬𝑷 𝑺𝑰𝑵𝑮𝑯 𝑾𝑰𝑳𝑳 𝑩𝑬 𝑻𝑯𝑬 𝑴𝑶𝑺𝑻 𝑬𝑿𝑷𝑬𝑵𝑺𝑰𝑽𝑬 𝑰𝑵𝑫𝑰𝑨𝑵 𝑷𝑳𝑨𝒀𝑬𝑹 𝑬𝑽𝑬𝑹......💰⚓#IPLAuction2025 #IPL2025 #Arshdeep pic.twitter.com/9zoUVIj20E
టీ20 ర్యాంకింగ్స్‌లో అర్షదీప్ రేర్ రికార్డు - టాప్-10లోకి ఫస్ట్‌టైమ్!
భారత్ Vs దక్షిణాఫ్రికా- టీ20 సిరీస్‌కు అంతా రెడీ- సూర్య, పాండ్య, అర్షదీప్ టార్గెట్స్ ఇవే!