పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం రోజురోజుకీ పెరుగుతోంది. పోలవరం మండలం కొత్తూరు కాజ్ వే పైకి గోదావరి నీరు ఐదు అడుగుల మేర చేరుకోవడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. గడచిన రెండు నెలల్లో ఐదుసార్లు కొత్తూరు కాజ్వే నీట మునిగింది. వరదలు నుంచి పూర్తిగా కొలుకోకముందే మళ్ళీ గోదావరి ప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో తడికలపై ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద ప్రమాదకస్థాయిలో ఉంది. వేలేరుపాడులో ఎద్దువాగు వంతెనపై నాలుగు అడుగులు నీరు చేరుకుంది
ఇవీ చదవండి