ETV Bharat / state

అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా గోదావరి వరద మళ్లింపు

పోలవరం ప్రాజెక్టులో గోదావరి వరద నీటిని అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా శుక్రవారం నుంచి మళ్లించే అవకాశం ఉందని సమాచారం. గోదావరి సహజ ప్రవాహ మార్గంలో కాకుండా ప్రస్తుతం మళ్లింపు మార్గంలో నీటిని వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే మీదుగా నీటిని వదిలేందుకు అప్రోచ్‌ ఛానల్‌ను కొంతమేర తవ్వారు. జూన్‌ 15 తర్వాత ఉభయగోదావరి జిల్లాల ఖరీఫ్‌ సాగుకు నీరు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు.

అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా గోదావరి వరద మళ్లింపు
అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా గోదావరి వరద మళ్లింపు
author img

By

Published : Jun 10, 2021, 7:07 AM IST

Updated : Jun 10, 2021, 2:09 PM IST

అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా గోదావరి వరద మళ్లింపు

ఒకవైపు గోదావరికి అడ్డుగా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేయడంతో నీటి ప్రవాహాలు వెనక్కు మళ్లుతున్నాయి. దీంతో పోలవరం దగ్గర నదిలో నీటిమట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకం పూర్తి లక్ష్యం మేరకు సిద్ధం కాలేదు. తొలుత 500 మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టారు. ఆ అప్రోచ్‌ ఛానల్‌లోనే శుక్రవారం నుంచి నీటిని వదిలే ఆస్కారం ఉంది. గోదావరి ఉపనది శబరి పరీవాహకంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్నాయి.

వరుసగా 26 సెంటీమీటర్లు, 56 సెంటీమీటర్ల మేర వర్షపాతం ఉంటుందన్న అంచనాల మేరకు రాబోయే నాలుగైదు రోజుల్లో గోదావరికి ప్రవాహాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా నీరు మళ్లించేందుకు యోచిస్తున్నారు. జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌ బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి తదితరులు బుధవారం పోలవరంలో వివిధ పనులను పరిశీలించారు.

కేంద్ర జలశక్తిశాఖ సమీక్ష నేడు: పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాసంపై గురువారం కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పనుల తీరును జలశక్తి కార్యదర్శి దిల్లీ నుంచి వర్చువల్‌గా సమీక్షిస్తారు. ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు. డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ అధికారులు ఉంటారు. వరద వచ్చే క్రమంలో పోలవరం పరిస్థితుల్ని సమీక్షిస్తారని తెలిసింది.

కృష్ణమ్మలో జలప్రవాహం

ఈ సంవత్సరం జూన్‌ ఆరంభంలోనే జూరాల నిండింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి దిగువకు కృష్ణమ్మ నీటిని విడుదల చేయడం, నారాయణపూర్‌-జూరాల మధ్యలో కురిసిన వర్షాలతో మంగళవారం రాత్రి నుంచే వరద ప్రవాహం వచ్చింది. బుధవారం ఉదయం 27,400 క్యూసెక్కులు రాగా, సాయంత్రం ఆరుగంటలకు 18,800 క్యూసెక్కులకు తగ్గింది. అయినప్పటికీ 9.66 టీఎంసీల సామర్థ్యం గల జూరాలలో అప్పటికే నాలుగన్నర టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఒక రోజులోనే పూర్తిస్థాయి మట్టానికి చేరువైంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 9.214 టీఎంసీల నిల్వ ఉంది.

తుంగభద్రలో స్థానికంగా కురిసిన వర్షాలతో కర్నూలు జిల్లాలోని సుంకేశుల నుంచి 3,284 క్యూసెక్కులు కిందకు వదిలారు. అటు జూరాల, ఇటు సుంకేశుల నుంచి కలిపి 8,441 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి ఉంది. కర్ణాటకలో ఎగువ ప్రాంతాలతో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టిలోకి 16,351 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 11,651 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈ రిజర్వాయర్‌ ఖాళీగా ఉంది. నిండటానికి 104 టీఎంసీలు అవసరం. దిగువన ఉన్న నారాయణపూర్‌కు 11,345 క్యూసెక్కులు రాగా, 13,511క్యూసెక్కులు దిగువకు వదిలారు.

ఇదీ చదవండి:

Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్.. అమిత్​ షాతో భేటీ

Last Updated : Jun 10, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.