ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏటిగట్టు బలహీనంగా ఉండి ప్రమాదం పొంచి ఉన్న చోట్ల గట్టును పటిష్టపరిచే చర్యలు చేపట్టారు. మట్టి బస్తాలతో గట్టు బలహీనంగా ఉన్నచోట్ల పూడ్చారు. పెనుగొండ మండల పరిధిలో పలుచోట్ల చర్యలు చేపట్టారు. గోదావరి మరింత పెరిగినప్పటికీ ప్రమాదం లేకపోయినా, ముందు జాగ్రత్తచర్యగా ఏటిగట్టును పటిష్టపరుస్తున్నామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో గ్రామరెవెన్యూ అధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, పహారా కాయాల్సిందిగా ఆదేశించారు.
ఇది కూడా చదవండి.