పశ్చిమ గోదావరి జిల్లా బర్లమడుగు వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అనూష, కవిత అనే ఇద్దరు బాలికలు దుస్తులు ఉతికేందుకు వాగు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుకుతూ... ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవటంతో నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు, బంధువులు వాగులో గాలించగా... చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. బాలికల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి.