ETV Bharat / state

తణుకులో గంజాయి విక్రయాలు.. బాలుడితో పాటు మరో ఇద్దరు అరెస్ట్​ - గంజాయి అక్రమ సరఫరా

Ganja Sellers Arrest : పశ్చిమ గోదావరి జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల మీద పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తణుకు పట్టణ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఒక బాలుడితో పాటు మరో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 23, 2023, 5:11 PM IST

Ganja Sellers Arrest : పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అడుగడుగునా జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ.. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాలు, అమ్మకాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా తణుకు పట్టణ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఒక బాలుడితో పాటు మరో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను, గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా, అమ్మకాల నిరోధానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో జిల్లా ఎస్పీ యు. రవి ప్రకాష్ మీడియాకు వివరించారు.

పట్టణ పరిధిలోని జపాన్ కాలనీ శివారు ఖాళీ స్థలంలో ఇద్దరు యువకులు, బాలుడు ప్లాస్టిక్ సంచులతో ఉన్నారనే సమాచారం రావడంతో తణుకు గ్రామీణ సీఐ ఆంజనేయులు, గ్రామీణ ఎస్సై రుద్రయ్య, సిబ్బంది వెళ్లారు. పోలీసులను గమనించి ముగ్గురూ ప్లాస్టిక్ సంచులతో సహా ద్విచక్రవాహనంపై పరారయ్యేందుకు ప్రయత్నించారు. సీఐ, ఎస్ఐ, సిబ్బంది వారిని అడ్డుకుని అదుపులోనికి తీసుకొని.. వారి వద్ద సంచులను పరిశీలించగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తణుకు పట్టణానికి చెందిన తరుణ్ కుమార్, శ్యామ్ సింగ రాయ్ అనే ఇద్దరు మరో బాలుడు గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడైంది. విశాఖపట్నం జిల్లా అరకు నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేసి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 22 కిలోల గంజాయి ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అవగాహన కార్యక్రమం: తణుకు పట్టణంలో గంజాయి సేవిస్తున్న వారికి, వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించి అవగాహన కల్పించారు. గంజాయి వినియోగిస్తున్న వారిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉండడం కలవరం కలిగిస్తుంది. ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించే సమయంలో గంజాయి వినియోగించే యువకుని కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కొంతమందికి తండ్రి లేనివారు, మరి కొంతమంది తల్లిదండ్రులు లేనివారు, కొద్దిమంది తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా లేకపోవడంతో ఆకతాయిలుగా మారి గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు జిల్లా ఎస్పీ గుర్తించారు. జిల్లావ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాలు అనర్ధాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని భీమవరం నరసాపురంలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. రాబోయే రోజుల్లో గంజాయి మత్తు పదార్థాల విక్రయిదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.