విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాజ్య సాధనలో భాగంగా రాష్ట్రంలో ఏడాది క్రితం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు డాక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో తెదేపా నేతలు ప్రధాన రహదారిలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకూ నివాళులు అర్పించారు.
భారతీయ ఘనత పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన రహదారిలో ఉన్న మహాత్ముడి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. గ్రామాలు ఆరోగ్యవంతం కావడానికి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. గాంధీజీ పిలుపునిచ్చిన స్వదేశీ వస్తు వినియోగాన్ని పూర్తిగా తీసుకుని లోకల్ ఫర్ లోకల్ నినాదంతో దేశీవస్తు వియోగానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
ఇవీ చదవండి: ఐసీసీ ట్విట్టర్ పేజీలో.. ఆంధ్రా చిన్నారుల ఆట!