పోలవరం నిర్మాణంలో వాస్తవ నివేదిక పంపాలని ఆదేశించినట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ స్పష్టం చేశారు. పోలవరానికి డబ్బు చెల్లించేది తామేనన్న గజేంద్రసింగ్ షెకావత్... ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరికీ ఎవరి ఆశీర్వాదాలు ఉండవన్న షెకావత్... కేంద్రం పని కేంద్రం చేస్తుంది... రాష్ట్రం పని రాష్ట్రం చేయాలని హితవు పలికారు. పీపీఏ నుంచి పోలవరంపై వాస్తవ నివేదిక రెండ్రోజుల్లో వస్తుందని చెప్పారు. నివేదిక వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రమంత్రి... పోలవరం టెండర్ల రద్దుపై కోర్టు స్టే ఇచ్చిందని... దాన్ని అమలుచేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...
వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు...ప్రభుత్వ వైపరీత్యం : చంద్రబాబు