రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అణచివేయటానికే.. చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు బానాయిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు పితాని సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
అమరావతి భూముల కొనగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ధర్మాసనం స్పష్టంగా పేర్కొందన్నారు. కక్ష సాధింపుతోనే సీఐడీ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ భూములపై ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా.. కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: