ETV Bharat / state

వెలుగుల వేంగినగరం.. కళ తప్పింది...! - capital

శతాబ్దాల ఆంధ్రుల చరిత్రలో రాజధానిగా వెలిగి.. ఎందరో కవులు, కళాకారులు, రాజులకు నిలయమైన వేంగినగరం.. ప్రస్తుతం పెదవేగిగా పేరు మార్చుకుంది. ఆనాటి స్మృతులు,  చిహ్నాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ ప్రాంతం.. ఇప్పుడు నిరాదరణకు గురవుతోంది. నాటి వేంగి... నేటి పెదవేగి.. ప్రస్తుత స్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

వెలుగుల వేంగినగరం..కళతప్పింది...!
author img

By

Published : Sep 5, 2019, 5:23 PM IST

వెలుగుల వేంగినగరం..కళతప్పింది...!

ఒకప్పటి ఆంధ్రుల రాజధానిగా.. వేంగి నగరంగా వెలుగొందిన ఈ పట్టణం ప్రభ.. ఇప్పుడు మసకబారింది. పెదవేగిగా పేరు మారి.. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. గతమెంతో ఘనం అన్న మాటకు.. అచ్చమైన నిదర్శనంగా నిలుస్తూ.. ఆ నాటి వైభం కాలగర్భంలో కలిసిపోయింది. వేంగి నగరం.. వందల ఏళ్లు రాజధానిగా ఉన్నట్లు... ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ చెబుతున్నాయి. మూడో శతాబ్దంలో శాలంకాయన రాజులు.. వేంగినగరాన్ని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. తర్వాత కాలంలో వేంగిచాళుక్య రాజులు ఇదే నగరాన్ని రాజధానిగా చేసుకొన్నారు. వారి వంశానికి చెందిన రాజరాజనరేంద్రుడు..10వ శతాబ్దంలో తమ రాజధానిని వేంగినగరం నుంచి రాజమహేంద్రవరానికి మర్చారు. అప్పటి నుంచి వేంగినగర కళ తప్పింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి మండల కేంద్రంగా నిలిచింది. ఈ పెదవేగి పట్టణమే.. ఒకప్పటి వేంగినగరమని చరిత్రకారులు సాధించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. పెదవేగిలో అప్పటి పాలనకు సంబంధించిన అనేక అవశేషాలు, ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. మరిన్ని వివరాలను.. పెదవేగి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

ఇదీ చదవండి:

11న పల్నాడు వస్తున్నా... వెలివేసిన వారిని తీసుకొస్తున్నా...

Intro:ap_knl_102_05_gurukula_japan_pkg_ap10054 ఆళ్లగడ్డ 8008574916 మాతృభాష తప్ప వేరే భాష నేర్చుకోవటం చాలా కష్టం అందులో ఇతర దేశాలకు చెందిన భాష నేర్చుకోవడం మరీ కష్టం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు రాష్ట్రంలోని బాలయోగి గురుకుల పాఠశాల లకు చెందిన విద్యార్థినులు రాష్ట్రవ్యాప్తంగా గా సాంఘిక సంక్షేమ గురు కులాలకు చెందిన విద్యార్థినులకు జపాన్ భాష నేర్పించాలని తపనతో ఈ గురుకుల కార్యదర్శి రాములు ముందుకు వచ్చారు ఆయనకు జపాను భాషపై ఉన్న పరిజ్ఞానంతో స్వయంగా ఆయనే ఆంధ్రప్రదేశ్లోని గురుకులాల విద్యార్థినులకు జూమ్ కాల్ ద్వారా జపాన్ భాషలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకే ఎంపిక చేసిన విద్యార్థినులకు ఈ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి తదుపరి స్థాయిలకు ఎంపికచేశారు వీరికి ఈడుపుగల్లు మెడికల్ ఐఐటి లో లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు అనంతరం చెన్నైలో జపాన్ వారి ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్ష నిర్వహించారు ఇందులో ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించి n5 స్థాయికి చేరుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ఎనిమిది మందిలో కర్నూలు జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండటం విశేషం భాషలో ప్రతిభ సాధించడం ద్వారా వారు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని గురుకులాల అధ్యాపకులు తెలుపుతున్నారు ఎంతో కష్టమైన ఈ జపాన్ భాషను ఈ విద్యార్థులు చక్కగా నేర్చుకున్నారు జపాన్ భాష లోనే పాటలు పాడుతున్నారు మాట్లాడుతున్నారు రాస్తున్నారు ఆళ్లగడ్డ గురుకులానికి చెందిన విద్యార్థిని ఉషా బి ఎన్ ఫైవ్ స్థాయికి చేరుకుంది వి తమ విద్యార్థిని సాధించిన ఘనత పట్ల ఆళ్లగడ్డ గురుకుల అధ్యాపకుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొదటి వాయిస్ ఉషా బి రెండవ వాయిస్ ఎస్తేరు రాణి మూడవ వాయిస్ రమాదేవి నాలుగవ వాయిస్ లక్ష్మీ ప్రసన్న ఆళ్లగడ్డ గురుకుల పాఠశాల ప్రధాన ఆచార్యులు

Body:జపాన్ భాషను నేర్చుకున్న గురుకులాల విద్యార్ధినులు

Conclusion:జపాన్ భాషలో కూడా విజయం సాధిస్తున్న గురుకుల విద్యార్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.