పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. మొత్తం 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కాగా 8 మందికి కడుపునొప్పితో బాధపడ్డారు. ఆహారం తిన్న విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆహరంలో కల్తీ జరగడంతో తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు. అందుకు భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి