ETV Bharat / state

గోదారమ్మ ఉగ్రరూపం.. క్షణం క్షణం.. భయం భయం...!

గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉభయగోదావరి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధమయ్యాయి. మరోవైపు గట్లకు గండ్లు పడిన కారణంగా.. పంటలు, తోటలు నీట మునిగాయి. జిల్లా పరిధిలోని పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలోని ప్రజలు నిరాశ్రయులయ్యారు.

flood water entered in villages in west godavari

author img

By

Published : Aug 18, 2020, 10:58 PM IST

గోదావరి వరదలతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల దాటికి చాలా చోట్ల గట్లకు గండ్లు పడటంతో గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లంక పరిధిలోని పంటలు, తోటలు పూర్తిగా నీటి మునిగాయి. జిల్లా పరిధిలోని పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

నీట మునిగిన పంటలు..

గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగడంతో దిగువన ఉన్న గోదావరి ప్రాంత ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో భద్రాచలం వద్ద గరిష్ట వరదనీటి మట్టం నమోదవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఫలితంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 90 కిలోమీటర్ల పైగా ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తీరాన ఉన్న లంక భూములు పంటలు నీట మునిగి ఉన్నాయి.

రైతులు ఆవేదన...

పెరవలి మండల పరిధిలోని ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు తదితర గ్రామాల పరిధిలో లంక భూముల్లోని తోటలుతో పాటు గోదావరి ఏటి గట్టు వెంబడి పంటలు నీటమునిగాయి.అరటి, పసుపు, పచ్చిమిర్చి, కూరగాయలతో పాటు పశుగ్రాసం తోటలు కూడా నీటిలో నానుతున్నాయి. ఇలాగే వరదలు కొనసాగితే పంట నష్టపోక తప్పదని రైతులు వాపోతున్నారు.

ఏటిగట్టును తాకుతూ...

నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల నీరు వశిష్ఠకు చేరటంతో ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుంది. పట్టణంలోని స్నానాల రేవులు పూర్తిగా నీటమునిగాయి. వలంధర్ రేవు వద్ద గోదావరి ఏటిగట్టును తాకుతూ వరద నీరు ప్రవహిస్తుంది.

ఎమ్మెల్యే పర్యటన..

వేలేరుపాడు మండల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఐటీడీఏ అధికారులు, జిల్లా అడిషనల్​ ఎస్పీ పరిశీలించారు.

ముంపు మండలాల్లోనూ అదే పరిస్థితి

భద్రాచలం వద్ద రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఏపీలోని విలీన మండలాల్లోని గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం బయటకు వచ్చేందుకు వీల్లేకుండా ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.