ETV Bharat / state

గోదావరి ఉగ్రరూపం...జలదిగ్బంధంలో విలీన మండలాలు

రాష్ట్రంలో గోదావరి ఉగ్రరూపంతో విరుచుకు పడుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరికి వరద పోటెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాలు నీటమునిగాయి.

polavaram  manadal westgodavari district
polavaram manadal westgodavari district
author img

By

Published : Aug 18, 2020, 6:51 PM IST

గోదావరి నది ఉగ్రరూపం దాల్చటంతో.. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి పరీవాహక గ్రామాలు దాదాపుగా నీటి మునిగాయి. గత నాలుగైదు రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టంతో భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని విలీన మండలాల్లోని గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం బయటకు వచ్చేందుకు వీల్లేకుండా ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఐటీడీఏ పీఆర్​వో సూర్యనారాయణ, జిల్లా అదనపు ఎస్పీ మహేశ్​ కుమార్ పర్యటించారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి

వరద ముంపులో కోనసీమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.