ఫేస్ మాస్ లింబో ఫైర్ స్కేటింగ్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఐదేళ్ల యాశిక..వజ్ర ప్రపంచ రికార్డు నెలకొల్పింది. యాశిక స్థానికంగా ఉన్న స్కేటింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతోంది. చిన్నారిలోని ఉత్సాహాన్ని గుర్తించిన కోచ్ లావణ్య...ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. వజ్ర గోల్డ్ ప్రపంచ రికార్డు ప్రతినిధుల సమక్షంలో కళ్లకు గంతలు కట్టుకొని ఏడున్నర అంగుళాల ఎత్తులో ఏర్పాటు చేసిన మంటల కింద నుంచి 10 మీటర్ల పొడవునా స్కేటింగ్ చేసి అబ్బురపరిచింది. యశికకు రికార్డు ధ్రువపత్రాన్ని, జ్ఞాపికను బహుకరించారు.
ఇదీచదవండి