కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధుల వరకు పంచాయతీలు, జిల్లా మండల పరిషత్‌లకు జనాభా సంఖ్య దామాషాలో కేటాయించారు. గడిచిన ఐదేళ్లుగా నిధులను పంచాయతీలకు మాత్రమే నేరుగా జమ చేస్తున్నారు. దీంతో తమకు గతంలో మాదిరిగా నిధులు కేటాయించాలని మండల జిల్లా పరిషత్ లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులలో మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.656.25 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 85 శాతం నిధులు పంచాయతీలకు 10 శాతం నిధులు మండల పరిషత్ లకు 5 శాతం నిధులు జిల్లా పరిషత్ లకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత