ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాలే, రైతు భార కేంద్రాలుగా..! - ఏలూరు జిల్లా వార్తలు

Farmers struggling: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతు పడరాని పాట్లు పడుతున్నాడు. గతంలో రైతు నుంచి నేరుగా రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి.... నాలుగైదు రోజుల్లో బకాయిలు చెల్లించేవారు. అయితే... ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆన్‌లైన్ విధానంలో ఇప్పటికీ బాలారిష్టాలు తొలగడం లేదు. ఏలూరు జిల్లా పెదపాడు, దెందులూరు, పెదవేగి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్‌ పనిచేయకపోవడంతో, ట్రాక్టర్లలో నింపిన ధాన్యంతో రైతులు నిరీక్షించాల్సి వచ్చింది.

Farmers struggling
అమ్ముకోవడానికి రైతులకు అవస్థలు
author img

By

Published : Dec 27, 2022, 10:42 AM IST

struggling to sell their crops in AP: పంట పండించటానికే కాదు.. అమ్ముకోవడానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ధాన్యం కొనుగోలు విధానం కర్షకుల పాలిట శాపంగా మారింది. రైతు భరోసా కేంద్రాలే, రైతు భార కేంద్రాలుగా మారాయి. చేతికందిన పంటను చూసి మురిసిపోవాలో, కొనుగోలు కాక కుమిలిపోవాలో తెలియని అయోమయస్థితిలో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. రబీ సీజన్‌ వచ్చినా... ఖరీఫ్ పంటను అమ్ముకోలేక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతున్న నానా తంటాలు పడుతున్నాడు.

రైతు భరోసా కేంద్రాలే, రైతు భార కేంద్రాలుగా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతు పడరాని పాట్లు పడుతున్నాడు. కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ల విధానంతో... అన్నదాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో రైతు నుంచి నేరుగా రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి, నాలుగైదు రోజుల్లో బకాయిలు చెల్లించేవారు. అయితే... ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆన్‌లైన్ విధానంలో ఇప్పటికీ బాలారిష్టాలు తొలగడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోఇప్పటికే ఖరీఫ్ వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రైతులు రబీ సాగుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికీ ధాన్యం అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.

'ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్‌ పనిచేయడం లేదు. ట్రాక్టర్లతో ఇబ్బందులు వస్తున్నాయి. నింపిన ధాన్యంతో నిరీక్షించాల్సి వస్తోంది. కల్లాల్ల్లో నుంచి ధాన్యం తరలించినప్పటి నుంచి అది ఎక్కడికి చేర్చాలో తెలియని అయోమయ పరిస్థితిలు ఎదురవుతున్నాయి. రైతులందరం ఇబ్బంది పడుతున్నాం. మిల్లర్లు ఎక్కువైన బస్తాలను పక్కన పెడుతున్నారు. ఉత్తమ రైతు కావాలంటే 50 బస్తాలు పండిచాలని ప్రభుత్వం అంటుంది. కానీ... ఒక్క బస్తా ఎక్కవైనా వాటిని దించుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో సిబ్బంది స్పష్టత నివ్వడం లేదు. ధాన్యం ట్రాక్టర్లతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్‌ విధానం తీసి పాత పద్దతినే కొనసాగించాలి.'- రైతులు

ఏలూరు జిల్లా పెదపాడు, దెందులూరు, పెదవేగి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్‌ పనిచేయకపోవడంతో, ట్రాక్టర్లలో నింపిన ధాన్యంతో రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. కల్లాల్ల్లో నుంచి ధాన్యం తరలించినప్పటి నుంచి అది ఎక్కడికి చేర్చాలో తెలియని అయోమయ పరిస్థితి రైతుల్ని వెంటాడుతోంది. ఆర్​బీకే సిబ్బంది స్పష్టత నివ్వకపోవడంతో.. ఏ మిల్లుకు చేర్చాలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రోడ్ల పక్కన ధాన్యం ట్రాక్టర్లతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విధానంలో పాత విధానమే బాగుందని... ఎప్పటిలానే తమకు ఇష్టమైన చోట ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.