ETV Bharat / state

'రైతులకు అండగా భరోసా కేంద్రాలు' - farmer reassurance centers Started in east godavari district

లాభసాటి వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు దోహదపడతాయని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు .పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను మంత్రి, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.

farmer reassurance centers Started    in east godavari district
పశ్చిమ గోదవరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
author img

By

Published : May 30, 2020, 1:40 PM IST

Updated : May 30, 2020, 5:56 PM IST

లాభసాటి వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు దోహదపడతాయని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ...వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో 61 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేయడమే కాక... బీమా, ఎరువులు, పురుగుల మందులను నేరుగా అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

Last Updated : May 30, 2020, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.