ETV Bharat / state

రవాణాశాఖ ఆన్​లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు.. - వాణాశాఖ ఆన్​లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు

Fake Fitness Certificates: రాష్ట్ర రవాణాశాఖ ఆన్​లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు వెలుగుచూశాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిధిలో వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

irregularity in the online services of the Department of RTA
వాణాశాఖ ఆన్​లైన్ సేవల్లో మరోమారు అక్రమాలు
author img

By

Published : Mar 18, 2022, 8:07 PM IST

Fitness Certificates Issue: వాహనాల ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో మరోమారు రవాణాశాఖలో ఆన్​లైన్​లో అక్రమాలు చోటు చేసున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మోటారు వెహికిల్ ఇన్​స్పెక్టర్​ జారీ చేసినట్టుగా.. వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ అయిపోయాయి. ఈ వ్యవహారంలో ఆ అధికారి లాగిన్ ఐడీని వినియోగించి మూడు వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లను జారీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. రవాణాశాఖకు డేటా బేస్ సేవలు అందిస్తున్న వోటీఎస్​ఐ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన విశ్వనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఈ అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది.

అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో ఇతర సేవలకు ఇబ్బంది లేదని రవాణాశాఖ స్పష్టం చేసింది. గతంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలను ఏపీలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు కొనసాగుతోంది. దానిపై విచారణ జరుతుండగానే మరోమారు అక్రమాలు వెలుగుచూడటం కలకలం రేపింది.

ఇదీ చదవండి: యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.