ఫేస్బుక్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను.. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పాలకొల్లుకు చెందిన తన్నీడి నాగరాజు, గుత్తుల మురళీకృష్ణ బాబు.. అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి బారిన పడిన ఓ బాధితుడి దగ్గర... 5 లక్షల 75 వేల రూపాయిల నగదు, ఒక బ్రాండ్డ్ వాచ్ దోచుకున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 70 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి ఘటనలపై యువత అప్రమత్తంగా ఉండాలని మోసపోవద్దని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి: