తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆరోపించారు. వైకాపా జిల్లా ప్లీనరీ సమావేశాన్ని.. కాళ్ల మండలం పెదఅమిరంలో రంగనాథరాజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్వా రైతులు విద్యుత్ రాయితీని తానే తీయించినట్లు ప్రభుత్వ విప్ ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ.. అక్వా రైతుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది తానేనని.. విద్యుత్ రాయితీని ఐదెకరాల నుంచి పది ఎకరాలకు పెంచేలా కృషి చేసింది కూడా తానేనని చెప్పారు. తనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
ఇవీ చూడండి: