కరోనా విపత్తు నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిరుపేదలకు పలువురు దాతలు అండగా నిలిచారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఆచంట మండలం పెనుమంచిలిలో జనసేన నాయకురాలు ఆకుమర్తి వెంకట లక్ష్మీ ఆధ్వర్యంలో తూర్పు గరవు, రాయికింద పేటలో మాస్క్లు, కూరగాయలు పంపిణీ చేశారు
పెనుమంట్ర మండలం సత్యవరం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని సత్యవరం, కొయ్యేటిపాడు గ్రామాల ప్రజలకు కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు. సుమారు రూ. 80 వేల వ్యయంతో 720 రేషన్ కార్డు కుటుంబాలకు వీటిని అందజేశారు.
పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామపంచాయతీ పరిధిలో దండు పద్మావతి సొసైటీ ఆధ్వర్యంలో 3వేల మందికి వివిధ రకాల కూరగాయలు అందజేశారు.
ఆచంట మండలం ఆచంట పెద్దపేట లూధరన్ చర్చి ఆధ్వర్యంలో 600 మంది పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:పేదల ఆకలి తీర్చిన ఎస్ఐ