రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నగారా మోగించింది. రాష్ట్రంలో 75 పట్టణాల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 33 పట్టణాల్లో వివిధ కారణాలతో ప్రక్రియ నిలిపివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్, 8 పట్టణాలు, ఒక నగర పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా నాలుగు పట్టణాలు నగర పంచాయతీ ఎన్నికల నిలిపివేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో విలీన గ్రామాల అంశం న్యాయస్థానంలో ఉండడం వల్ల ఎన్నికలు నిలిపివేశారు. భీమవరంలో విలీన గ్రామాల ప్రతిపాదన అంశం పరిశీలనలో ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆకివీడు నగరపంచాయతీ కొత్తగా ఏర్పడటంతో ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాలేదు.
జిల్లాలో నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం పట్టణాలతో పాటు ఏలూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టడానికి రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. అధిక శాతం మున్సిపాలిటీ నియోజకవర్గ కేంద్రాలు కావడం వల్ల అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు తమ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: