పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లాస్థాయి క్రికెట్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. క్రికెట్ పోటీల్లో మూడో రోజు ఏలూరు రామచంద్ర ఏంబీఏ కళాశాల జట్టుకు, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లకు 92 పరుగులు చేశారు. అనంతరం 93 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రామచంద్ర ఎంబీఏ కళాశాల జుట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇవీ చదవండి...'ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్ టీమిండియాదే'