పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. భీమవరంలోని కే.జీ.ఆర్.ఎల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఈ పోటీల్లో రెండోరోజు భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల జట్టు, జీ.వీ.వీ.ఐ.టీ కళాశాల (భీమవరం) జట్లు తలపడగా విష్ణు కళాశాల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్లో డీ.ఎన్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల భీమవరం, శ్రీ మారుతీ జూనియర్ కళాశాల, తణుకు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. అనంతరం మూడో మ్యాచ్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల భీమవరం జట్టు, శ్రీ వాసవి జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెం జట్లు తలపడ్డాయి.
ఇవీ చదవండి..