పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు . ఉత్సవాల వద్ద విద్యుత్ అలంకరణ చేశారు నిర్వాహకులు. స్వామివారికి నిత్యం విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. నగరంలో భారీ మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో 18 అడుగుల మట్టి వినాయక విగ్రహం, మెయిన్ బజార్ కుండీలలో 21 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాక చెవులూపే ఉండ్రాలయ్య ఆకర్షణగా నిలుస్తోంది.
ఇదీచూడండి.వినాయక చవితి విశిష్టతలేమిటో...?