ETV Bharat / state

ద్వారకా తిరుమలకు.. ఎన్జీటీ ఛైర్​పర్సన్ శేషశయనారెడ్డి - west godavari

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ చైర్ పర్సన్ బి శేషశయనారెడ్డి గురువారం సందర్శించారు. స్వామిని దర్శించుకుని.. కొండపైన మొక్కలు నాటారు.

ఎన్జీటీ
author img

By

Published : Jun 13, 2019, 7:44 PM IST

ద్వారకా తిరుమలకు వచ్చిన ఎన్జీటీ ఛైర్​పర్సన్ శేషశయనారెడ్డి

పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలను మోడల్ విలేజ్ లుగా తీర్చిదిద్దేందుకు... ద్వారకా తిరుమల, ఏలూరు మండలంలోని సత్రంపాడు ,శనివారపుపేట గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. మూడు గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు.. ద్వారకా తిరుమలలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అమల తీరును జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ చైర్ పర్సన్ బి.శేషశయనారెడ్డి పరిశీలించారు. ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన మొక్కలు నాటారు. అనంతరం.. గ్రామం నడిబొడ్డున ఉన్న చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు.

ఇది కూడా చదవండి.

ఘర్షణకు దారి తీసిన స్థల వివాదం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ చైర్ పర్సన్ బి శేషశయనారెడ్డి గురువారం సందర్శించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి అనంతరం కొండపైన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు .తర్వాత గ్రామం నడిబొడ్డున ఉన్న చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించారు.

Body:పశ్చిమగోదావరి జిల్లాలో మోడల్ విలేజ్ లుగా తీర్చిదిద్దేందుకు ద్వారకా తిరుమల, ఏలూరు మండలం లోని సత్రంపాడు ,శనివారపుపేట గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడంతో పాటు ,పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ద్వారకా తిరుమలలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అమల తీరును నేషనల్ గ్రీన్ క్రిమినల్ కమిటీ చైర్ పర్సన్ బి.శేషశయనారెడ్డి పరిశీలించారు. ముందుగా అయిన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత గ్రామం నడిబొడ్డున ఉన్న చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రం నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది ..ఎంత ఆదాయం వస్తుంది.. అనే విషయాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభ దశలో ఉండటం వల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుందని అధికారులు సమాధానం ఇచ్చారు. అలాగే పొడి చెత్తను ఏ విధంగా ఉపయోగిస్తున్నారని అధికారులు అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. అలాగే పరిసర ప్రాంతాలు కలుషితమవుతాయి తెలిపారు. అలా కాకుండా చెత్తను ఒక చోటకు పోగుచేసి శాస్త్రీయ పద్ధతుల్లో మనకు ఉపయోగపడే విధంగా కంపోస్టు తయారు చేసుకోవచ్చని సూచించారు. ఈ విధంగా వేస్ట్ మెటీరియల్ నుంచి వచ్చిన కంపోస్టు పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. గ్రామాల్లో ప్రజల వద్ద చెత్త వేసే సమయంలో పొడి, తడి చెత్త వేరు చేసి ఉంచితే తడి చెత్త ను ఉపయోగించి కంపోస్ట్ తయారు చేస్తారని తెలిపారు. ఈ విధంగా చేయడం వలన రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన వాతావరణంతో పాటు కాలుష్య రహిత సమాజాన్ని ముందు తరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్ కల్లా ద్వారకాతిరుమల, సత్రంపాడు ,శనివారపుపేట గ్రామాలను జీరో వేస్ట్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామన్నారు.

Conclusion:ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ చక్రధరరావు, డి పి ఓ విక్టర్ , డి పి ఆర్ సి కోఆర్డినేటర్ మహాలక్ష్మి ,స్థానిక ఎంపిడిఓ మోహన ప్రసాద్, తహసిల్దారు యం కృష్ణమూర్తి ,ఈ ఓ పి ఆర్ డి సుందరి తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.