పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నియంత్రించేందుకు దేవస్థానం గతంలో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా... కొండపైకి అన్యమత స్టిక్కర్లు, ఫొటోలు ఉన్న వాహనాల రాకపోకలను నిషేధించారు. టోల్ గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఇలాంటి వాహనాలను ఆపి వెనక్కి పంపించేవారు. కొంత కాలం అన్యమత నిషేధ నిబంధనలు అమలు చేసినప్పటికీ... రానురాను అధికారులు గాలికొదిలేశారు. దీంతో అన్యమత స్టిక్కర్లు, ఫొటోలు ఉన్న వాహనాలు కొండపైన తిరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అన్యమత ప్రచారాన్ని నిషేధించాలని హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు కోరుతున్నారు.
అన్యమత ఫొటోలు, స్టిక్కర్లు ఉన్న వాహనాలను కొండపైకి అనుమతించవద్దని ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్‌రావు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అన్యమత స్టిక్కర్లు, ఫొటోలు ఉన్న వాహనాలలో రావద్దని సూచించారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం