ETV Bharat / state

'జీవనదులున్నా దొరకని నీరు.. పట్టించుకోని అధికారులు' - నీటి సరఫరా ఇక్కట్లు

జీవనదులు ప్రవహించే నేలలో.. మంచినీటి కోసం సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. నేతలు, అధికారులకు ముందుచూపు లేకపోవడం, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల.. పశ్చిమగోదావరి జిల్లాలో చాలాచోట్ల రక్షిత మంచినీటి పథకాలు పడకేస్తున్నాయి. అరకొరగా సరఫరా చేసే నీటినీ కొంతమంది మోటార్లతో తోడేస్తుండటంతో.. శివారు ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు నీళ్లు దొరికే పరిస్థితి లేకుండా పోయింది.

water scarcity at west godavari
పశ్చిమగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి
author img

By

Published : Apr 18, 2021, 5:44 PM IST

తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యలను వివరిస్తున్న జిల్లా వాసులు..

పశ్చిమగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో సరఫరా నిలిచిపోయిందని ప్రజలు అంటున్నారు. శివారు ప్రాంతాల ప్రజల నీటి ఇక్కట్లు వర్ణనాతీతంగా మారింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. వచ్చే ఏడాదైనా సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నేతలు, అధికారుల దృష్టి సారించకే సమస్య..

గోదావరి, కృష్ణా, కొల్లేరు జలాలు సమృద్ధిగా లభ్యమయ్యే పశ్చిమగోదావరి జిల్లాలోనూ వేసవి నీటి కష్టాలు మొదలయ్యాయి. చుట్టూ నీరున్నా.. సరిగ్గా ఉపయోగించుకోవాలనే తపన నేతలకు, అధికారులకు లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం, పర్యవేక్షణా లోపం, అధికారుల అలసత్వమే ప్రస్తుత దుస్థితికి కారణమని చెబుతున్నారు. ఇప్పుడు తీవ్ర నీటిఎద్దడి ఉన్న ప్రాంతాలన్నీ.. గతంలోనూ సమస్యను ఎదుర్కొన్నవేనంటున్నారు. కనీసం తాగడానికైనా నీరు సరఫరాకు ఏర్పాట్లు చేయాలంటూ.. ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానీ పరిష్కారంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఆ నిర్లక్ష్యమే పట్టణాలు, పల్లె ప్రాంతాల్లో నీటి సమస్య పెరగడానికి కారణమైంది.

వారానికి రెండుసార్లే నీటి సరఫరా..

జిల్లాలోని 48 మండలాల పరిధిలో ఉన్న 908 పంచాయతీల్లో నీటి సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శీతాకాలంలోనే సరఫరా సరిగ్గా లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాల్లో.. వేసవి ఆరంభం నుంచి ఎద్దడి మరింత తీవ్రమైంది. డెల్టా ప్రాంతంలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోనూ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలికలు, రెండు నగర పంచాయితీల్లోనూ తాగునీటి కటకట ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో రెండు రోజులకోసారి నీళ్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం నాలుగురోజులైనా నీరు రావట్లేదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మూడు రోజులకోసారి వదులుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

పైపులైన్లు మరమ్మతులకు నోచుకోక సమస్యలు..

డెల్టా ప్రాంతంలో గోదావరి నీటిని చెరువులకు మళ్లించి.. ఆ తర్వాత శుద్ధిచేసి వినియోగిస్తారు. ప్రస్తుతం చెరువుల్లోనూ నీరు అడుగంటింది. గోదావరి నీరు పంట పొలాలకే సరిపోక.. తాగునీటి చెరువులు నింపలేకపోయారు. తాగునీటి పథకాల కోసం 45 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నా.. పరిస్థితి మెరుగుపడటం లేదు. మెట్ట ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం, కొయ్యలగూడెం, దేవరలపల్లి మండలాల్లో బోర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు.

పలు ప్రాంతాల్లో బోర్లలో నీరు అడుగంటడం, మోటార్లు పనిచేయకపోవడంతో సరఫరా ఆగిపోతోంది. జిల్లాలో 350తాగునీటి బోర్లు వేయాలని ప్రతిపాదనలు పంపగా.. రెండేళ్లయినా ఆమోదం పొందలేదు. సుమారు 850 పైప్ లైన్లు మరమ్మతులకు నోచుకోక, సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఎవరికీ సరిపోవట్లేదు. దీనికోసం వెచ్చిస్తున్న 23 కోట్ల రూపాయలు.. పైపులైన్లు, మోటార్ల మరమ్మతుకు ఖర్చు చేస్తే బాగుండేదని జనం అంటున్నారు.

ఇవీ చదవండి:

తాడేపల్లిగూడెంలో వాలంటీర్‌ ఆత్మహత్య

రైల్వే సాయం కోరిన దిల్లీ ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.