వింత వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్ ఏఆర్ మోహన్ అన్నారు. గత ఆరు రోజులతో పోల్చుకొంటే.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. ఎన్సీడీసీ, ఎయిమ్స్, ఎన్ఐవీ, వ్యవసాయశాఖల బృందాలతో ఏఆర్ మోహన్ పరిస్థితిని సమీక్షించారు. గతరాత్రి నుంచి ఆరు కేసుల మాత్రమే నమోదయ్యాయని అన్నారు. వ్యాధి తీవ్రత తగ్గుతోందని తెలిపారు. వ్యాధి నిర్ధారణ కాలేదని.. ఒకటి రెండు రోజుల్లో వ్యాధి స్పష్టత వచ్చే వీలుందని తెలిపారు. ఎన్సీడీసీ క్షేత్రస్థాయిలో పరిశోధన సాగిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన