ETV Bharat / state

రెడ్​జోన్​ ప్రాంతాన్ని పరిశీలించిన డీఐజీ - రెడ్​జోన్​లో డీఐజీ పర్యటన

పశ్చిమగోదావరి జిల్లాలోని రెడ్​జోన్​ ప్రాంతమైన గుండుగొలనులో ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పర్యటించారు. కరోనా నివారణ చర్యలు, భద్రతను పరిశీలించారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు.

dig
dig
author img

By

Published : Apr 17, 2020, 5:26 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు భీమడోలు మండలం గుండుగొలనులో శుక్రవారం పర్యటించారు. ఇటీవల గుండుగొలనులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో రెడ్​జోన్​గా ప్రకటించారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై రాకపోకలు నిషేధించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భద్రతా పరిస్థితులు, కరోనా నియంత్రణ చర్యలను డీఐజీ పరిశీలించారు. స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి ద్వారా గ్రామంలోని వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు తీసుకున్న రక్త పరీక్షల వివరాలు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. అందువల్ల ప్రజలందరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి

వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.