కచ్చులూరు బోటు ప్రమాదంలో బోటును కష్టపడి వెలికితీసిన ధర్మాడి సత్యంను అభినందిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సత్కారం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడి నారాయణరావు, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అత్యంత ధైర్య సాహసాలతో మునిగిన బోటును ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యం ఎందరికో ఆదర్శనీయులని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ధర్మాడి సత్యాన్ని ఘనంగా సత్కరించి బంగారు కాయిన్ను బహూకరించారు. గోదావరిలో మునిగిన బోటును తీయడాన్ని ఒక ఛాలెంచ్ గా తీసుకున్నామని ధర్మాడి సత్యం అన్నారు. తన బృందంలోని సభ్యులంతా నెల రోజులు కష్టపడి పనిచేయడం వల్లే బోటు వెలికితీశామన్నారు. తమపై అభిమానం చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: