పోలవరం నిర్మాణ పనుల గురించి గత 13 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం ఆన్‌లైన్లో ఎలాంటి సమాచారం వెల్లడించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తెదేపా హయాంలో నిబంధనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు పనులు జరిగాయని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జలవనరుల శాఖకు డిఫాక్టో మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒట్టిసీమ అన్న పట్టిసీమే ప్రస్తుతం రాష్ట్రానికి దిక్కయిందని... ఆ నీళ్లే తాగుతున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఉమ అన్నారు.
ఇదీ చదవండి: విచిత్ర బంధం..శునకాలతో వానరం స్నేహం