పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులను... కేంద్రం నుంచి రీయంబర్స్ చేయించలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం పూర్తి చేయడంపై రాజ్యసభలో వైకాపా ఎంపీలు స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌కు పోలవరం ఇష్టం లేకనే... ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఖర్చుపెట్టిన నగదు కూడా తెచ్చుకోకపోవటం... మూర్ఖత్వమని మండిపడ్డారు.
ఇదీ చదవండి