Dalit leaders agitation at bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం గరగపర్రులో దళితులకు ఇచ్చిన ఐదు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. చలో కలెక్టరేట్ చేపట్టిన దళితులు.. భీమవరంలో కలెక్టరేట్ వరకూ ర్యాలీ తీశారు. గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు వివాదం ఏర్పడి 5ఏళ్లు గడిచినా.. సమస్యను పరిష్కరించడంలేదని మండిపడ్డారు.
![Garagaparru Dalit Chalo Collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15745110_bvrm1.png)
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని దళిత నాయకులు కోరారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని.. లేనిపక్షంలో కలెక్టరేట్‌ను మట్టడిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు.. కలెక్టర్‌ను కలిశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: