పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
తమ బాధ్యతగా సరకులు అందించామని తెలిపారు. సుమారు 300 మందికి పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇవీ చదవండి: