కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మెడికల్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. మందుల కొనుగోలుకు వచ్చే వారిని నిర్ణీత సమయంలోనే పట్టణంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. దీనివల్ల మెడికల్ షాపుల ముందు కొన్నివేళల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. సామాజిక దూరం పాటిస్తుండటం వల్ల మందుల దుకాణం ముందు బారులు కనిపిస్తున్నాయి. ముందుల కోసం వినియోగదారులు ఎండలో నిలబడాల్సి వస్తోంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దుకాణాల ముందు షామియానాలు వేయిస్తున్నారు యజమానులు.
ఇదీ చదవండి: రావద్దని పోలీసులు.. వస్తామని విద్యార్థులు.. సరిహద్దు ఉద్రిక్తం..!